Home » Andhrapradesh
వైసీపీ కంచుకోటగా ఉన్న కడప గడ్డపై టీడీపీ జెండాను రెపరెపలాడించిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఎవరైనా నోరు జారితే సహించేది లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు.
ఆంధ్రా ఊటీగా గుర్తింపు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి అటకెక్కినట్లే కనిపిస్తోంది. టూరిజం రంగాన్ని ఉరకలెత్తించి తద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు తమ వంతు ప్రయత్నాలను తీవ్రంగా చేశారు.
దానిమ్మ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. నానాటికీ తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెలరోజుల క్రితం ఉన్న ధరలు అమాంతం తగ్గి సగానికి పడిపోతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి.
నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
ఒడిశా టు హైదరాబాద్ బస్సులో బ్రీఫ్ కేసుల్లో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏఈఎస్ జీవన్‌కిరణ్, ఇన్‌స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రూట్‌వాచ్ నిర్వహించారు.
ఇంట్లో ఉన్న తిండి గింజలు అమ్ముకొని తాగేశావా అని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి తన భార్యను ఆదివారం రాత్రి గొడ్డలితో నరికి చంపాడు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రాఘవేంద్ర, లక్ష్మిదేవి(30)లు నివాసమున్నారు. వీరికి శృతి అనే కుమార్తె ఉంది. రాఘవేంద్ర కొన్నేళ్లుగా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు.
దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్‌లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడినా.. ఆన్‌లైన్ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.