Home » Andhrapradesh
అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు అపోహలకు గురికావద్దని తెలియజేశారు.
ఎవరై నా ఆత్మపరిశీలన చేసుకుంటే మార్పు వస్తుం దని, మంచిమనిషిగా మనుగడ సాగించగలరని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయా ధికారి ఎన రాజశేఖర్ అన్నారు. మార్పుతోనే మంచిమనిషిగా మనుగడ సాగించగలరన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. ఏపీ విద్యారంగంలో లోకేశ్ తీసుకువస్తున్న వినూత్నమైన మార్పులకు గానూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, ఇవాళ(బుధవారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సమావేశమైంది.
వైసీపీ కంచుకోటగా ఉన్న కడప గడ్డపై టీడీపీ జెండాను రెపరెపలాడించిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఎవరైనా నోరు జారితే సహించేది లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు.
ఆంధ్రా ఊటీగా గుర్తింపు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి అటకెక్కినట్లే కనిపిస్తోంది. టూరిజం రంగాన్ని ఉరకలెత్తించి తద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు తమ వంతు ప్రయత్నాలను తీవ్రంగా చేశారు.
దానిమ్మ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. నానాటికీ తగ్గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నెలరోజుల క్రితం ఉన్న ధరలు అమాంతం తగ్గి సగానికి పడిపోతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి.
నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.