Home » Andhra Pradesh
తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
దిత్వా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులను హోంమంత్రి అనిత అలర్ట్ చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మార్కెటింగ్ మాజీ జీఎం సుబ్రమణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. కల్తీ నెయ్యి గురించి ముందే తెలిసినే కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న కంపెనీలకే నెయ్యి సరఫరాకు సుబ్రమణ్యం, టీటీడీ ఉన్నతాధికారులు అవకాశం కల్పించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ సిట్ పొందుపర్చింది.
రాజధాని రైతుల సమస్యలపై సీఆర్డీఏ అధికారులతో త్రీ మెన్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతు కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అధికారులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.
కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే ప్రజానాట్య మండలి కళాకారుడి హత్య కేసు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక నిందితుడు, హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా..
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వచ్చేనెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. ఏపీలోకి పెట్టుబడులు లక్ష్యంగా లోకేష్ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ వింగ్‌తో లోకేష్ ఆత్మీయ భేటీ జరుపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక రంగం నుంచీ సహకరించాలనే ఉద్దేశంతోనే ఒకేరోజున 15 ఆర్థిక సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు......
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.