Home » Anantapur urban
ప్రతి గ్రామంలో భూ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని, అసైన్డమెంట్ కమిటీలను ఏర్పాటుచేసి వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపురంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మండల కేంద్రానికి చెం దిన టీడీపీ కార్యకర్త రామన్నను పోలీసులు కొట్టిన ఘటనలో సీఐ కరుణాకర్ ను వీఆర్ కు పంపుతూ బుధవారం అ నంతపురం రేంజ్ డీఐజీ షిముషి ఆదేశాలు జారీ చేశా రు. డబ్బుల విషయంలో మంగళవారం రాత్రి పెద్దమనిషిగా వెళ్లిన మాజీ సర్పంచ కుటుంబ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రామన్నను సీఐ కరుణాకర్ కొట్టారని టీడీపీ కార్యకర్తలు, నేతలు స్థానిక స్టేషన ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణ చేసి డీఐజీ షిముషికి నివేదిక ఇచ్చారు.
ఆ గ్రామానికి తారు రోడ్డు అనేది గ్రామస్థుల ఏళ్లనాటి కల. గ్రామ ఏర్పాటై దాదాపు నాలుగు తరాలు దాటింది. అయినా ఆ గ్రామానికి వెళ్లాలంటే నిత్యం ఒడిదుడుకుల ప్రయాణమే. మట్టిరోడ్డులోని అడుగడుగునా గుంతల్లో గ్రామస్థులు నిత్యం అవస్థల ప్రయాణం సాగించేవారు.
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దనకు ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం అనంతపురం నగరానికి వచ్చిన ఆయన్ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు గంగారామ్, నాయకులు పీఎల్‌ఎనమూర్తి, పరమేశ్వరన, కడియాల కొండన్న, గోపాల్ గౌడ్, లక్ష్మీనరసింహ, స్వప్న, సంగా తేజస్విని, ఇస్మాయిల్, ఓంకార్‌రెడ్డి, తాటి మధు, నెట్టెం బాలకృష్ణ, వడ్డే భవానీ, చరిత, అయేషా తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్క రించుకుని మంగళవారం సాయంత్రం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి నూతన వస్త్రార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి చీరలను అమ్మవారి ఎదుట ఉంచి పూజలు చేశారు.
శ్రీచైతన్య పాఠశాలల ఉపాధ్యాయులుగా ఎస్కేయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈ మేరకు సోమవారం ఇనచార్జ్ వీసీ ప్రొఫెసర్ అనిత, రిజిస్ర్టార్ రమే్‌షబాబు విద్యార్థులకు నియామక పత్రాలందజేసి అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అయలు చూయాలని, లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక వాసవీ కల్యాణమండపంలో సీపీఐ మండల మహాసభలు నిర్వహించారు.
వాతావరణ పరిస్థితులతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేయాల్సి ఉందని విశ్రాంత వైస్ చాన్సలర్, సీఆర్‌ఐడీఏ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.
మాకు విమానశ్రం వద్దు.. మాభూములే కావాలంటూ ఇనచార్జి కలెక్టర్ శివనారాయణశర్మకు రైతులు విన్నవించారు. ఇటీవల కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ వస్తుందని, ఇందుకు అధికారులు భూములు గుర్తిస్తున్నారని, మీడియా, సోషల్‌మీడియాలలో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది.
బాలలను, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ధర్మవరం సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి గీతావాణి పేర్కొన్నారు. మండలంలోని యర్రోనిపల్లిలో శనివారం ఆర్డీటీ, ధర్మవరంలీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.