Home » Akhilesh Yadav
INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలకు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి.. పంజాబ్‌లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా.. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్ ను సమాజ్‌వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి గట్టిదెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విభిన్నంగా స్పందించారు. 'ఇండియా' కూటమిలోనే నితీష్ ఉంటే ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థి కావొచ్చని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఆహ్వానించారు. ఆ రోజు హాజరుకాలేనని అఖిలేశ్ యాదవ్ స్పష్టంచేశారు.
అయోధ్యలో రామాలయం ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం 2024 జనవరి 22న జరగనుండటంతో యూపీ ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేస్తుండగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) మాత్రం ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆలయానికి వెళ్తానని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav ) ఆరా తీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించారు.
Telangana: తుంటి ఎముక ఫ్యాక్చర్‌తో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్ విగ్రహాన్ని సోమవారంనాడు ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.