Home » Akhilesh Yadav
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా పది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు మంగళవారం (మే7న) పోలింగ్ జరగనుంది. ఈ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మే 5న ఆయన ఉత్తరప్రదేశ్‌లో(UP) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఉత్తరప్రదేశ్ అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇక్కడినుంచే గెలిచి దేశానికి ప్రధానులుగా వ్యవహరించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభకు పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆ ప్రకారం అఖిలేష్ రూ.26.34 కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. ఆయన భార్య, మెయిన్‌పురి నియోజకవర్గం పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌కు రూ.15 కోట్లు ఆస్తులు ఉన్నాయి. మొత్తంగా ఈ దంపతుల ఆస్తి విలువ రూ.41 కోట్లుగా ఉంది.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీచేసే నియోజకవర్గం ఖరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 150 సీట్లకు మించి రావని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. తొలి విడత పోలింగ్ ప్రచారానికి బుధవారంనాడు తెరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఇద్దరు నేతలు మీడియా సంయుక్త సమావేశంలో పాల్గొ్న్నారు.
గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయనేతగా మారి ఇటీవలే జైలులో గుండెపోటుతో మరణించిన ముఖ్తార్ అన్సారీని గత ఫిబ్రవరి 16న జైలులోనే మరణించిన రష్యా విపక్ష నేత అలెగ్జీ నవాల్నీతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోల్చారు. ముఖ్తార్ అన్సారీ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు పంపింది. 160 సీఆర్‌పీసీ కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు పంపింది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 2012-2016 మధ్య ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగుచూసింది.
ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.