Home » Air india
జూన్ 14 వియన్నాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దిగిపోవడం కలకలం రేపింది. పైలట్‌లు పరిస్థితిని వెంటనే చక్కదిద్దడంతో గమ్యస్థానానికి యథాప్రకారం చేరుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన పరిహారం పెంపు కోసం యూకేలోని బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాతో పాటు బోయింగ్‌పై కూడా కేసు వేసేందుకు నిర్ణయించుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
టోక్యో-ఢిల్లీ ఎయిర్ ఇండియా AI 357 బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డాటా రికార్డర్‌తో ఉన్న బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి మురళీధర్ మోహోల్ ధ్రువీకరించారు. అది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధీనంలో ఉందని తెలిపారు.
శనివారం ఓ ఎయిర్ ఇండియా విమానంలో భార్యాభర్తలు తగవు పడ్డారు. ఈ క్రమంలో మహిళ భర్త మరో ప్యాసెంజర్‌తో కూడా దురుసుగా వ్యవహరించడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమృత్‌సర్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాకు చెందిన అనీశ్ అగర్వాల్ తల్లి, తండ్రి.. అనీశ్ సోదరుడు ఈనెల 27న ఎయిర్ ఇండియా విమానం (ఏ1-190)లో టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణె రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఎయిర్ ఇండియా సంస్థ వారి ప్రయాణ తేదీలను మార్చేసింది!
యుగంధర్‌కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్‌పీపీ సిబ్బంది ఉంటారు.
అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా AI454 విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుందనగా.. ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. చివరకు ఏం జరిగిందంటే..
ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్‌పోర్టు గేట్‌వే సర్వీసెస్ ప్రొవైడర్ ఏఐఎస్ఏటీఎస్‌లోని నలుగురు ఉన్నతాధికారులు ఆఫీసులో పార్టీ ఏర్పాటు చేశారు. సిబ్బంది ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే..
సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్..ఎయిర్ ఇండియా భాగస్వా్మ్యంతో (ఏఐఎస్ఏటీఎస్) దేశంలోని పలు విమాశ్రయాల్లో గ్రౌండ్ సేవలు అందిస్తోంది. అహ్మదాబాద్ ఘటన జరిగిన కొద్దిరోజులకే గురుగ్రామ్‌లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయంలో సిబ్బంది పార్టీ చేసుకున్నారు.