Home » Air india
మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. అయితే ఒక్క వ్యక్తి అంత పెద్ద దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఎంత (Air India Crash Compensation) వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
లండన్‌లో చదువుకుంటున్న తన కూతురిని చూసేందుకు విజయ్ రూపాని ఎయిరిండియా విమానంలో పయనమయ్యారు. విమానంలో ఆయన కూర్చున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. వేరే ప్రయాణికురాలు విమానంలో తన సీటులో కూర్చున్న విజయ్ రూపానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లో 242 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా కూలిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా గతంలో దేశంలో చోటుచేసుకున్న కొన్ని ప్రధాన విమాన ప్రమాదాలను (Top 10 Flight Accidents india) ఒకసారి పరిశీలిద్దాం.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లి కూలిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం.
Air India Flight Ticket Offer: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది మీ కలా.. అయితే, మీ కోరిక తీరేందుకు ఇదే మంచి ఛాన్స్.. వెంటనే ఎయిరిండియా లాంచ్ చేసిన మెగా సేల్‌లో టికెట్ బుక్ చేసుకోండి. బస్సు లేదా రైలు టికెట్‌కు అయ్యే ఖర్చుతోనే ఫ్లైట్ ఎక్కేయండి. డిసెంబర్ 10, 2025 వరకూ దేశవిదేశాల్లో ఎక్కడికైనా అతితక్కువఖర్చుతోనే విమాన ప్రయాణం చేసే అవకాశం మిస్సవకండి.
Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడుల తర్వాత ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ ముఖ్య ప్రకటనను విడుదల చేశాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం దేశం ఒక్కసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర ఘటన తర్వాత తిరోగమన ప్రయాణం కోసం అక్కడున్న టూరిస్టులు ఎక్కువగా ఫ్లైట్లను ఆశ్రయించారు. ఇదే సమయంలో ఫ్లైట్స్ సైతం రెట్లను పెంచాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా-చైనా మధ్య సాగుతున్న సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న సమయంలో, భారత్‌కు ఇది ఒక అపూర్వ అవకాశంగా మారింది. ఈ క్రమంలో చైనా తిరస్కరించిన బోయింగ్ విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయబోతోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.