Home » Air india
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోక ముందు కాక్‌పిట్‌లో ఏం జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు.
విమాన ప్రమాద బాధితులను ఆదుకునేందుకు రూ.25 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది.
బోయింగ్ 787 విమానాలు భారత్‌కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని, ఈ తనిఖీల్లో కొన్నింటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాల రాకపోకల్లో జాప్యం జరగవచ్చని ఎయిరిండియా తెలిపింది.
ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 11ఏ సీటులోని ప్రయాణికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. 27 ఏళ్ల నాటి విమానం ప్రమాదంలో కూడా 11ఏ నెంబర్ సీటులో ప్రయాణికుడు సురక్షితంగా బయటపడటం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.
ఎంతో ఆనందంగా లండన్‌కు బయలు దేరిన 241 మంది జీవితాలను కాల్చి బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాద ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా..
విమానం వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, కాక్‌పిట్ వంటి కీలక సమాచారం బ్లాక్‌బాక్స్‌లో ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి. ఎలాంటి విపత్తులు ఎదురైనా డేటా చెక్కుచెదరకుండా ఉండేలా బ్లాక్ బ్సాక్‌ను రూపొందిస్తారు.
అహ్మదాబాద్‌లో గురువారం బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతి చెందగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
విమానంలో ఒక ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్ రన్ అవుతుంది అంటున్నారు.. ఆది తప్పు. రెండు ఇంజన్లు ఒకేసారి రన్ అవుతుంటాయి. పక్షులు అడ్డు రావడం అనేది కూడా కారణమే కాదు.. ఇది ప్రతీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండే సమస్యనే..
విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు.