Home » AIADMK
టీవీకే సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామి పెట్టిన పోస్టు ఉత్కంఠను మరింత పెంచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న పార్టీకి శుభాకాంక్షలు చెబుతూ ఆయన పోస్టు పెట్టారు. కానీ ఆ పార్టీ పేరును మాత్రం ప్రస్తావించలేదు.
అనిశ్చితికి తెరదించుతూ తమిళనాడులో AIADMK త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ సీనియర్ నేత అన్బళగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా తమిళనాడులో ఒక 'అద్భుతం' జరగబోతోందని ఆయన ఆన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, విజయ్‌కి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రావిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బతికున్నంతవరకూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆమెను చూస్తేనే భయంతో వణికిపోయేవారని, ఆ తరువాత తాను జైలుకు వెళ్లడంతో వారిలో భయం పూర్తిగా పోయిందని ఆలిండియా పురట్చితలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం నాయకురాలు శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రికి ఓటు వెయ్యొద్దని తిరువొత్తియూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్ కుమారుడు ప్రచారం చేయడం ఆ పార్టీ నేతల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
ప్రముఖ సినీ నటుడు అజిత్ అభిమానుల మద్దతు పొందేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులతో రెండవ జాబితాను అన్నాడీఎంకే శుక్రవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో 127 మంది అభ్యర్థులు ఉన్నారు.
శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అన్నాడీఎంకే బుధవారంనాడు విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.పళనిస్వామి మరోసారి తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి పోటీలో ఉన్నారు.