Home » Adilabad
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌లు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.
నూతన సంవత్సర వేడుకల్లో విషా దం నెలకొంది. స్నేహితులతో కలిసి దావత్ చేసుకొని తిరి గి వస్తుండగా బైక్ అదుపు తప్పి కాల్వలో పడిన సంఘ టనలో మంగళవారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. మండల కేంద్రానికి చెందిన మంద రాజు (35), జిల్లాపెల్లి పవన్‌కళ్యాణ్(25) లు బైక్‌పై దండేపల్లి శివారులో అటవీ ప్రాంతంలో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు.
పోలీసులు స్టేషన్‌కు పిలిపించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్దికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఏడాది కాలంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 2023 డిసెంబరు 3న వెలువడ్డ ఎన్నికల ఫలితాలు జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశాయి. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. మూడు నియోజక వర్గాల్లో దశాబ్దంపాటు పాలన సాగించిన బీఆర్‌ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
సీఎం కప్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ హ్యాండ్ బాల్ జిల్లా జట్టుకు సోమవారం మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 27 నుంచి 29 వరకు హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగు లు చేపట్టిన సమ్మె సోమవారం 21వ రోజుకు చేరుకుంది. బుర్రకథను చెబు తూ ఉద్యోగులు విసూత్న నిరసన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న విద్యా విధానంలో సేవా కార్యక్రమాలు, అదే విధంగా తాము ఎదుర్కొంటున్న సమ స్యలను వివరిస్తూ బుర్ర కథ రూపంలో వివరించారు.
అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐబీ చౌరస్తా లో సోమవారం వామపక్ష పార్టీల నాయకులు అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
మండలంలోని సర్వాయిపేట గ్రామా నికి చెందిన గుగ్లోత్ రుచిత జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వ హించే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఎంపికైంది. కోటపల్లి మోడల్ స్కూల్, కళాశాలలో ఇంటర్ వరకు చదువుకున్న రుచిత ప్రస్తుతం శాతావాహన విశ్వ విద్యాలయం పరిధిలోని కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం... లాభాల లక్ష్య సాధనలో కృషి చేస్తోంది... ఉద్యోగావకాశాలు, పర్యావరణ పరిరక్షణ, వైద్య సదుపాయాలు కల్పిస్తోంది... నూతన విద్యుత్ ప్రాజెక్టుల వైపు దూసుకెళ్తోంది... అయితే గతేడాది కంటే ఈసారి బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది.
భారత కమ్యూనిస్టు పార్టీది త్యాగాల చరిత్ర అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి శత వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శ్రీరాంపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.