Home » Adilabad
నిర్మల్ జిల్లా: అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్‌లోని కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతుండడంతో పిల్లలను తల్లిదండ్రులు వారి ఇళ్లకు తీసుకువెళుతున్నారు.
జిల్లాలో క్రైం రేట్ వేగంగా పెరుగుతోంది. పోలీస్‌శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేస్తున్నప్పటికీ చాపకింద నీరులా పెరిగిపోతూనే ఉండటం సర్వత్రా ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాలో వ్యభిచారం, జూదం నిత్యకృత్యం కాగా గంజాయి వినియోగం, నకిలీ విత్తనాల సరఫరా విస్తరిస్తోంది.
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న తమ పార్టీకి చెందిన నాయకులపై దాడులకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ డిమాండ్ చేశారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో శని వారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పలువురు రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సీఐ వేణుచందర్ అన్నారు. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్ పోలీసు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ప్రజా సంక్షేమమే లక్ష్యం గా ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. దశాబ్దా లుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పనులు ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నాయి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద్, గడ్డం వినోద్‌లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మండలంలోని కిష్టంపేట గ్రామంలోని వరలక్ష్మీ జిన్నింగు మిల్లు ఎదుట పత్తికి మద్దతు ధర చెల్లించాలని రైతులు శుక్రవారం చెన్నూరు-మం చిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిం చారు.
రైసుమిల్లుల యజమానులు ధాన్యం బకా యిలు ప్రభుత్వానికి చెల్లించకుంటే చట్టపర మైన చర్యలు తప్పవని సివిల్ సప్లయి టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం ముదిగుంట గ్రామం లోని బీఎస్‌వై రా రైసుమిల్లు, టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైసుమిల్లులను తని ఖీ చేశారు.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుం దని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలిపారు.