• Home » Adilabad

Adilabad

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాజారమేష్‌ పేర్కొన్నారు. శుక్ర వారం ఆదిల్‌పేట గ్రామంలో ఇంటింటికి పోస్టర్లను అం టించి నిరసన తెలిపారు.

ఆగని ఇసుక అక్రమ రవాణా...

ఆగని ఇసుక అక్రమ రవాణా...

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వపరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు దాన్ని పక్కదారి పట్టించి పెద్ద మొత్తంలో ప్రైవేటులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి

నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థినుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకు న్నారు.

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీటవేస్తోందని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి ఠాగూర్‌ స్టేడి యంలో అస్మిత ఖేలో ఇండియా అండర్‌ -13 ఉమెన్స్‌ పుట్‌బాల్‌ లీగ్‌ 2024-2025 టోర్నమెం ట్‌ను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పత్తి కొనుగోలుకు పడిగాపులు

పత్తి కొనుగోలుకు పడిగాపులు

సీసీఐ అధికారులు, జిన్నింగు మిల్లు యజ మానులు దళారులకు కొమ్ము కాస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రేపల్లెవాడలోని జిన్నింగు మిల్లు యజమానులతో వాగ్వాదానికి దిగా రు. రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లు వద్ద రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మా భూములు మాకు ఇప్పించండి

మా భూములు మాకు ఇప్పించండి

మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరులోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వారు మాట్లా డుతూ దొరలకు పాలేరుగా ఉండడంతో అందించిన భూమిని రెండేళ్ళ క్రితం వరకు సాగు చేసుకుని జీవిస్తుండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభి వృద్ధి పేరిట తమ భూములను బలవంతంగా లాక్కుందన్నారు.

లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు...

లక్ష్యం దిశగా ధాన్యం కొనుగోళ్లు...

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు లక్ష్యంలో మూడు వంతుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా, మరో 30వేల టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, డీసీఎంఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇండస్ర్టియల్‌ హబ్‌తో పారిశ్రామికంగా అభివృద్ది

ఇండస్ర్టియల్‌ హబ్‌తో పారిశ్రామికంగా అభివృద్ది

వేంపల్లి గ్రామం ఇండస్ర్టియల్‌ హబ్‌గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్‌ హాలులో భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ర్టియల్‌ హబ్‌ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు.

 భూములను దౌర్జన్యంగా లాక్కొంటోంది

భూములను దౌర్జన్యంగా లాక్కొంటోంది

మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపహాడ్‌ శివారులో ఇండస్ర్టియల్‌ హబ్‌ కోసం పేద రైతుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటుందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ముల్కల్లలోని దళిత రైతులను కలిశారు. ఆయన మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి, పోచంపహాడ్‌లో ఇండస్ర్టియల్‌ పార్కు కోసం సుమారు 295 ఎకరాల భూమి సేకరణకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అనుచరులు గ్రామాల్లోని దళిత రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

సింగరేణి రిటైర్డ్‌ కార్మికుల ఆందోళన

సింగరేణి రిటైర్డ్‌ కార్మికుల ఆందోళన

బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి రిటైర్డు కార్మికులు సింగరేణి క్వార్టర్లలో విద్యుత్‌ పునరుద్ధరించాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి