Home » ACB
గొర్రెల స్కామ్‌లో కేసు నమోదు అయినప్పటి నుండి మొయినుద్దీన్ ఆయన కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరూ పరరీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ హైదరాబాద్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల స్కీమును స్కామ్‌గా మర్చి రూ. 1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
Gopi ACB Custody: మాజీ మంత్రి విడుదల రజిని మరిది విడుదల గోపిని రెండో రోజు ఏసీబీ అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు. ఈరోజు విచారణలో మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.
ఎసీబీ విచారణలో భాగంగా, విడదల రజిని మరిది గోపి పేర్కొన్నాడు, వదిన చెప్పిన తర్వాతే స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడానని. 2.2 కోట్లు వసూలు చేసి బెదిరించారని తెలిపాడు
Vidudala Gopi ACB custody: మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గోపినీ ఏసీబీ ప్రశ్నించనుంది.
ఏసీబీ అధికారులు విజయ్‌కుమార్‌రెడ్డి పై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి, విచారణకు సహకరిస్తామని తెలిపాడు
ఏసీబీ అధికారాల సమాచారం ప్రకారం, ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదులు, అసోసియేటెడ్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సిసోడియా, జైన్‌లను విచారించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత మార్చిలో ఆమోదం తెలిపారు.
రిమాండ్‌లో ఉన్న ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఓ కేసులో ఇద్దరు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు తిరిగి ఇవ్వడానికి లంచం తీసుకున్న శామీర్‌పేట ఎస్సై పరశురామ్‌నాయక్ ఏసీబీకి చిక్కాడు.
ఏసీబీ అధికారులు హరీ రామ్‌ను అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో ఈఎన్‌సీ హరి రామ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించిన 14 చోట్ల అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. సోదాలు ముగిసిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున జడ్జి ముందు హాజరు పర్చగా విచారణ జరిపి న్యాయమూర్తి హరిరామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.