Home » ABN Andhrajyothy
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో వన్డే కోసం రాయ్‌పుర్ చేరుకుంది. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి చిన్నారులు గులాబీ పూలతో ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హైదరాబాద్ తరలిరానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.
తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే.. తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు.
మహారాష్ట్ర థానేలో ఓ యువకుడి తొందరపాటుతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పెళ్లిని వాయిదా వేయడంతో మనస్తాపానికి గురై కుటుంబానికి తీవ్ర ఆవేదనను మిగిల్చాడు.
పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితా సవరణ (SIR), ఢిల్లీ పేలుళ్ల ఘటనకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు.
మహారాష్ట్రలో ఇటీవల ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడి తమ ప్రేమను నిరూపించుకుంది ఓ యువతి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పరువు హత్య కేసులో యువతి తండ్రి అరెస్ట్ అయ్యాడు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం టోల్‌గేట్ వద్ద రివాల్వర్ ఒకటి బయటపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి దగ్గర వాహన తనిఖీల్లో గుర్తించారు అక్కడి పోలీసులు.
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తోన్న వీరు.. ఒకేసారి ఇలా సూసైడ్‌కు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది.
నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదైంది.