Home » Aadhaar Card
అదొక చిన్న గ్రామం. దూరం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. గ్రామంలోకి అడుగిడితే రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ‘అదేం చెట్టు?’ అని అడగ్గానే గ్రామస్తులు... చెట్టుకు ఉన్న స్టిక్కర్‌ను ఫోన్‌లో స్కాన్ చేసి చూపిస్తారు.
ఆధార్ నెంబర్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలే కాదు, చిన్నపిల్లలందరికీ ఆధార్ డేటా సరిగా ఉండటం చాలా అవసరం. కానీ పిల్లల విషయంలో అనేక మంది తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో UIDAI స్కూళ్లతో చేతులు కలిపి కీలక చర్యలకు సిద్ధమైంది.
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సొల్యూషన్ కూడా నెల నెలా స్థిరమైన వృద్ధిని చూపుతోందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. జూలై ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జూన్ కంటే 22% వృద్ధిని నమోదు చేశాయని వివరించింది. జూలైలో ఒకే రోజులో అత్యధిక ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను కూడా నమోదు అయినట్లు చెప్పారు.
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద.. ఇకపై ఉచితంగా బస్సు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసి ఉండాలని అధికారులు తెలిపారు.
ఆధార్ కార్డు వివరాల అప్‌డేషన్ మరింత సులభతరం చేసే యాప్ అభివృద్ధిపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ యాప్ సాయంతో పేరు, అడ్రస్ వంటి వివరాలను యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా మరింత సులువుగా అప్‌డేట్ చేసుకోవచ్చని సమాచారం.
మీ ఆధార్లో అడ్రస్ మారిందా. దీని కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఈజీగా ఆన్లైన్ విధానంలో అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
పాఠశాలల్లోనే పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేసే ప్రక్రియను చేపట్టాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ..
ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తల్లిదండ్రులు అప్డేట్ చేయాలని కేంద్రం తాజాగా సూచించింది. ఏడేళ్లు దాటితే మాత్రం అప్‌డేషన్ కోసం రూ.100 చెల్లించాలని పేర్కొంది. బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ కాని వారి ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.
దేశంలో 12 అంకెల ఆధార్ కార్డ్ మన గుర్తింపునకు చిహ్నంగా ఉంది. కానీ దీని భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్, డేటా లీక్ వంటి మోసాల నుంచి ఆధార్ను (Aadhaar Misuse Prevention) ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.