Home » 2024
ఎల్‌నినో ప్రభావం, వాతావరణంలో మార్పులు, సముద్రాలు వేడెక్కడం తదిత ర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది.
క్రీడల్లో మహిళలు రాణిస్తుండడం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తోందని ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్ విశాలా ఫెర్రర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక అనంతపురం క్రికెట్ గ్రౌండ్‌లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా క్రికెట్ కప్-2025 టోర్నీ ప్రారంభోత్స వానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, బ్యాటింగ్, బౌలింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు.
మండలంలోని పుట్ట కనుమ ఘాట్‌రోడ్ ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. భానుకోట గ్రామ సమీపంలో పుట్టకనుమ ఘాట్‌రోడ్ ఉంది. ఈ రహ దారి గుండా ప్రతిరోజు వందలు వాహనాలు ధర్మవరం, తరగరకుంట, కళ్యాణదుర్గం మీదుగా వెళుతుంటాయి. ఘాట్‌రోడ్డు వద్దకు రాగానే వాహనదారులు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నా రు.
మండల కేంద్రమైన నార్పల క్రాసింగ్ వద్ద 18 ఎకరాల విస్తీర్ణంలో ఈనెల 18, 19 తేదీలలో జరిగే ఇజ్‌తమా ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెతో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ... 12 సంవత్స రాల తరువాత నార్పలలో ఇజ్‌తమా ఏర్పాటు చేశామని, ఇందులో 25వేల 30వేల మంది పాల్గొంటారని వారు తెలిపారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో గ్రామాల రోడ్లు రూపురేఖలు మా రుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, గుంతల రోడ్ల స్థానం లో తారురోడ్లు నిర్మిస్తుండడంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. మండలంలోని మరూరు నుంచి చాపట్లకు, మరూరు నుంచి ఎం. చెర్లోపల్లి మీదుగా పాలబావికి తారురోడ్ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభు త్వంలో 2018లో అప్పటి మంత్రి పరిటాల సునీత నిధులు మంజూరు చేయించారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించా రు.
అభివృద్ధే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి టీడీపీ పాలనలోనే సాధ్యమన్నారు. బుధవారం మండల పరిధిలోని రేకలకుంట గ్రామంలో పల్లె పండగ కింద నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు.
నిబంధన ప్రకారం అధికారి బదిలీ అయినా, సస్పెన్షన లేదా పదవీవిరమణ పొం దిన వెంటనే పాత అధికారి స్థానంలో కొత్తగా బాధ్యత లు తీసుకున్న అధికారి పేరును రెండు మూడు రోజుల్లో చేర్చాలి. అయితే అధికారి మారి దాదాపు రెండు నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రికార్డు లు, బోర్డుల్లో పాత అధికారి పేరే కనిపిస్తోంది.
నగర శివార్లలోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని శిల్పారామం ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా సాగాయి. మంగళ, బుధవారాల్లో ప్రజలు పెద్దఎత్తున సంక్రాంతి, కనుమ వేడుకలను జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముంగిట రంగురంగుల రంగవల్లులను వేసి, గొబ్బెమ్మల ను ఏర్పాటు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించారు. ఆలయాల్లోనూ మకర సంక్రమణ పూజలు, కనుమనాడు గోపూజ నిర్వహించారు. టీటీడీ హిం దూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం తలుపూరు లోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం గోపూజ చేశారు.
ధను ర్మాసోత్సవాలను పురస్కరించుకుని సోమ వారం నగరంలోని పలు ఆలయాల్లో గోదా రంగ నాథస్వామి కల్యాణో త్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించా రు. మొదటిరోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రా మాలయం, అరవింద నగర్‌లోని కృష్ణమంది రం, వేణుగోపాల్ నగర్ సాయినాథ మందిరం, అశోక్‌నగర్‌లోని సత్యనారాయణస్వామి ఆలయాల్లో కల్యాణోత్సవం నిర్వహించారు.