ప్రముఖ గాయని చిత్రకు రాజేశ్వరి ఉదయగిరి ఇప్రెస్ ఆఫ్ మెలోడి (Empress of Melody) బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిత్రకు గోపాల్ పోణంగి ప్రత్యేక ప్రశంసా పత్రంతోపాటు గౌరవ పత్రాన్ని అందజేశారు.
జర్మనీలోని హాంబర్గ్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ, కన్నడతోపాటు జర్మనీలో నివసిస్తున్న భారత్‌లోని ఇతర రాష్ట్రాల వారు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు.
బహ్రెయిన్‌లోని తెలంగాణ ప్రవాసీ సంఘమైన తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అక్టోబర్ 17న (శుక్రవారం) దసరా సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది.
అమెరికా సాహితీ సంస్థలు అర్చన ఫైన్ ఆర్ట్స్, శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ (హ్యూస్టన్) సంయుక్తంగా దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు సాహిత్యంలో తమదైన మృద్రవేసిన మహనీయులకు సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలను అందజేశాయి.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్, ఫర్నిచర్ అందజేశారు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి. స్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే స్పందించి సహాయం అందించి సహకరించిన..
కిలిమంజారో పర్వతం టాంజానియాలో ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతం (5895 మీటర్లు/19,341 అడుగులు). ఇది మూడు గొప్ప అగ్నిపర్వత శిఖరాలైన కిబో, మావెన్జీ, షిరా కలయికతో ఏర్పడింది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (టీఏజీబీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న స్థానిక లిటిల్టన్ హైస్కూల్లో దసరా–దీపావళి ధమాకా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన ఎస్. రఘురాంను టీఏజీబీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. పలువురు సమాజసేవకులను కూడా సన్మానించారు.
ఖతర్‌లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘానికి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ అనూహ్యంగా అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా తమ గెలుపు నల్లేరుమీద నడకే అన్న విశ్వాసంతో ఉన్న ప్రత్యర్ధి శిబిరం నుండి పోటీ చేసిన వారిలో..
అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు ‘తెలుగు వనంలో గజల్ పరిమళం’ పేరిట సదస్సు జరగనుంది. కొరుప్రోలు మాధవరావు, విజయలక్ష్మి కందిబండ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పాకలపాటి వేణు గోపాల కృష్ణంరాజు తన మధుర గానంతో కార్యక్రమానికి వచ్చిన వారిని అలరించనున్నారు.
పాఠశాల 2025 - 26 నూతన విద్యా సంవత్సరం అట్లాంటాలో ‘‘పలక బలపం’’ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమైంది. గురువుల పరిచయాలతో.. తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలతో కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.