భారతీయ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని ప్రోత్సాహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా రాలీలో చిన్న జీయర్ సంస్థ జెట్ క్యారీతో కలిసి శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించింది. అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించిన ఈ సీతారామ కళ్యాణం.. స్థానిక భారతీయ సమాజాన్ని ఒక్కతాటిపైకి తెచ్చింది.
కెనడాలో నాలుగేళ్ల నాటి వృద్ధ జంట హత్య కేసులో ముగ్గురు భారత సంతతి యువకులు తాజాగా దోషులుగా తేలారు. త్వరలో కోర్టు వారికి శిక్షను ఖరారు చేయనుంది.
ప్రవాసంలో తమలో ఒకరిగా ఉంటూ ఆ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన ఒక ప్రవాసీయుడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారు సౌదీ అరేబియాలోని ఈశాన్య ప్రాంత ప్రవాసాంధ్రులు. ఇటీవల ఆయన అకస్మాత్తుగా మరణిస్తే ఆయనకు సామూహిక శ్రద్ధాంజలి ఘటించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ‘తానా స్కాలర్‌షిప్ వెబినార్’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ వెబినార్‌లో కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ, స్కాలర్‌షిప్ అవకాశాలపై విలువైన సూచనలను అందించారు.
మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పరమార్థ సింగపూర్‌లో 2026 ఏప్రిల్ 18 నుండి 24 వరకు 409వ భాగవత సప్తాహాన్ని ఘనంగా నిర్వహించారు.
బహ్రెయిన్‌లోగల ప్రవాసాంధ్ర సంఘం తెలుగు కళా సమితిలో బుధవారం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు, పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
కుటుంబ పోషణ కోసం గల్ఫ్‌కు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు తెలుగు ప్రవాసీయులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో యువతి మృతదేహాన్ని స్వదేశానికి పంపిస్తామని అన్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ టీమ్ తాజాగా నిర్వహించిన విల్ అండ్ ట్రస్ట్ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించింది.
సింగపూర్‌లోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవం 2026 ఏప్రిల్ 25న ఘనంగా జరిగింది.