కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్‌కు సంబంధించి కేడర్‌కు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) గెలిచేదెవరు..? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఎవర్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అక్షరాలా నిజమవుతాయా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాయా..? 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన 2,383 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని.. 3.33 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు..
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) సూచించారు. ఎన్నికల కౌంటింగ్ ఏజంట్లతో ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని మెజార్టీ ఎక్సిట్ పోల్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆరా మస్తాన్ (Aaraa Mastan) సర్వే మాత్రం వైసీపీనే (YSRCP) మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పింది.
అధికారం పోతోందని వైసీపీ మంత్రులు, సలహదారులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (AP Election Results) మంగళవారం నాడు (జూన్-04న) రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి..
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్‌కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీంకోర్టును (Supreme Court) వైసీపీ (YSRCP) ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్‌పై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టనున్నది.