Share News

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

ABN , Publish Date - May 22 , 2026 | 08:27 PM

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది.

ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే.. ఈ ప్రాంతాల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిల్చోవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

Updated Date - May 22 , 2026 | 08:27 PM