Share News

తెలంగాణలో మళ్లీ మొదలైన వర్షాలు.. హైదరాబాద్‌ సహా 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

ABN , Publish Date - Sep 07 , 2026 | 07:21 AM

తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో మళ్లీ మొదలైన వర్షాలు.. హైదరాబాద్‌ సహా 6 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌
Telangana Weather Alert

ఇంటర్‌నెట్ డెస్క్: తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఆ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


మేడ్చల్‌, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం

వైభవంగా తెలంగాణ గంగ తెప్పోత్సవం

Updated Date - Sep 07 , 2026 | 07:53 AM