Share News

నైరుతి రుతుపవనాలు బలహీనం

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:03 AM

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించే సమయం కావడంతో రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో సోమవారం పొడి వాతావరణం నెలకొంది.

నైరుతి రుతుపవనాలు బలహీనం

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించే సమయం కావడంతో రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో సోమవారం పొడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా రావిపాడులో 39.9, తిరుపతిలో 38.6, కడప జిల్లా బద్వేలులో 37.2, మూలవంకలో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా కోటపాడులో 56.2, సబ్బవరంలో 40.5, తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 42.5, తిరుపతి జిల్లా చంద్రగిరిలో 32.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 07:05 AM