Share News

Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:14 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయి.

Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం
Cyclone Update IMD

ఆంధ్రజ్యోతి, జనవరి 7: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ్టికి (జనవరి 7, 2026) వాయుగుండంగా (డిప్రెషన్) మారింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా (డీప్ డిప్రెషన్) మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా ప్రయాణిస్తుందని అంచనా.


దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు.. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్యజిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండగా, ఏపీలో ప్రస్తుతానికి తేలికపాటి ప్రభావమే ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్

For More TG News And Telugu News

Updated Date - Jan 07 , 2026 | 10:14 PM