రేపు ‘ఈశాన్యం’ రాక
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:02 AM
దేశంనుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించేందుకు అనువైన వాతావరణం నెలకొంది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): దేశంనుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించేందుకు అనువైన వాతావరణం నెలకొంది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీనికి సంబంధించి గురువారం అధికారికంగా ప్రకటన రానుంది. కాగా, అండమాన్ సముద్రంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేయగా.. అందుకు అనువైన వాతావరణం ఏర్పడలేదు. మరోవైపు శ్రీలంక పరిసరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.
దీని ప్రభావంతో గురువారం నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత