Share News

ఈ ఏడాది ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించిన రుతుపవనాలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:01 PM

ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించాయి. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ఏడాది ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించిన రుతుపవనాలు
India Monsoon 2026

న్యూఢిల్లీ, జూన్ 4: నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళంతో పాటు తమిళనాడులోకి ప్రవేశించాయి. ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించాయి. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కేరళం, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేరళంలోని 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.


జూన్ 4వ తేదీనుంచి 7వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, సిక్కింలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో పగటి పూట ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని వెల్లడించింది. మీరట్, నోయిడా, ఘజియాబాద్, ముజఫర్‌నగర్, షామ్లీ, సహరాన్‌పూర్, మధుర, ఆగ్రాలలో ఎండలు తీవ్రంగా ఉంటాయని, వడగాడ్పులు వీచే అవకాశం అధికంగా ఉందని తెలిపింది. లక్నో, కాన్పూర్, ఉన్నావో, బరబంకీ, రాయ్ బరేలీ, సీతాపూర్, హర్దోయ్‌లో పిడుగులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


ఇవి కూడా చదవండి

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

బావి నీరు ఇలా.. తాగేదెలా?

Updated Date - Jun 04 , 2026 | 02:01 PM