రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:16 AM
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం Low Pressure Area Likely Over Bay of Bengal on Tuesday
విశాఖపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మలక్కా జలసంధి, పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం అక్కడే స్థిరంగా కొనసాగుతున్నది. ఇది సోమవారం నాటికి అండమాన్ సముద్రంలో ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత మూడు, నాలుగు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే క్రమంలో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అనేక చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. కర్నూలులో 37.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండతీవ్రతతో అక్కడక్కడ ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్