Share News

రేపటి నుంచి జులై 2 వరకు వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్..

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:30 PM

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 27వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

రేపటి నుంచి జులై 2 వరకు వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్..
Telangana Weather

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 27వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.


మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 26 , 2026 | 06:41 PM