Share News

నిప్పుల కొలిమిలా రాష్ట్రం

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:41 AM

రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రుతుపవన మేఘాల జాడ లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. ఇంకా పడమర దిశ నుంచి పొడి గాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమల్లోని ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది.

నిప్పుల కొలిమిలా రాష్ట్రం

  • 3 చోట్ల 40 డిగ్రీలు నమోదు

  • పలుచోట్ల వడగాడ్పులు

  • మరో మూడు రోజులు ఇంతే

  • 11 లేదా 12న అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రుతుపవన మేఘాల జాడ లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. ఇంకా పడమర దిశ నుంచి పొడి గాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమల్లోని ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచే వడగాడ్పులు ప్రారంభం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. తిరుపతి, నెల్లూరు, కావలిలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు, ఉక్కపోత, వడగాడ్పులు మరో మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ నెల పదో తేదీ తర్వాత బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి, 11 లేదా 12న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కోస్తాలో ఈ నెల 11 నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

లచ్చప్ప మాస్టారు..

Updated Date - Sep 08 , 2026 | 04:41 AM