సాగునీటి రంగానికి మహర్దశ
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:33 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూడిపోయి పిచ్చిమొక్కలతో నిండిపోయిన రాచర్ల మండలంలోని పలు చెరువుల మరమ్మతులు, అభివృద్ధికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రాచర్ల మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న ప్రధాన చెరువులు, కుంటలు మరమ్మతులు, పూడికతీత పనులకు (ఎఫ్‌డీఆర్-2025) ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
రాచర్లకు రూ.1.25కోట్లకు పైగా నిధుల వరద
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చొరవతో చెరువుల అభివృద్ధి
యుద్ధప్రాతిపదికన సాగుతున్న పనులు
కొన్నిచోట్ల పూర్తి, మరికొన్ని చోట్ల ముమ్మరంగా పూడికతీత
రైతుల్లో ఆనందాల వెల్లువ
ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యేపై ప్రశంసల జల్లు
రాచర్ల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూడిపోయి పిచ్చిమొక్కలతో నిండిపోయిన రాచర్ల మండలంలోని పలు చెరువుల మరమ్మతులు, అభివృద్ధికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రాచర్ల మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న ప్రధాన చెరువులు, కుంటలు మరమ్మతులు, పూడికతీత పనులకు (ఎఫ్‌డీఆర్-2025) ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఈ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొన్ని ప్రధాన చెరువుల్లో మరమ్మతుల పనులు విజయవంతంగా పూర్తికాగా, మరికొన్ని కీలకమైన చెరువులు, కుంటల్లో పనులు ప్రస్తుతం శరవేగంగా, ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నిధుల కేటాయింపు, పనుల పురోగతితో మండలంలోని సాగునీటి రంగం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మార్క్
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మండలంలోని సాగు నీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత వైసీపీ చెరువుల అభివృద్ధి, వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ప్రజా ప్రభుత్వం దృష్టికి రైతుల ఇబ్బందులను తీసుకెళ్లి యుద్ధప్రాతిపదికన నిధులను రాబట్టారు. మండల ప్రజలకు, రైతులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయించి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తుండడంతో నియోజకవర్గ రైతులు అటు ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యేపైనా ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.
రాచర్ల మండల చెరువుల నిధుల వివరాలు
రాచర్ల గ్రామంలో చిన్న చెరువు గండి పూడ్చివేతకు రూ.5లక్షలు, పామిరెడ్డి కుంట మరమ్మతులకు రూ.5లక్షలు, జేపీచెరువు గ్రామం అంబచెరువు మరమ్మతులు, అభివృద్ధికి రూ.5లక్షలు, అచ్చంపేట గ్రామం ఉప్పులేటి చెరువు మరమ్మతులు, పునరుద్ధరణకు రూ.7లక్షలు, పాలకవీడు గ్రామం కాశ్యపువాని కుంట పునరుద్ధరణకు రూ.7లక్షలు, కొత్తపల్లి గ్రామం రామిరెడ్డి కుంట ట్యాంక్ అభివృద్ధికి రూ.6లక్షలు, పాలకవీడు గ్రామం కాశ్యపువాని కుంట ట్యాంక్ బాబుకు రూ.6లక్షలు, సోమిదేవిపల్లి గ్రామం దసబంధం చెరువు గండి పూడ్చడానికి రూ.9లక్షలు, ఆకవీడు గ్రామం దొడ్డేటి చెరువు మరమ్మతులు, కాలువ పూడికతీతకు రూ.9.50లక్షలు, అనుములపల్లి గ్రామం అనుములపల్లి చెరువు, కాలువ పూడికతీతకు రూ.9.90లక్షలు, పాలకవీడు గ్రామం సర్కార్ పెద్ద ట్యాంక్ స్లూయిస్ మరమ్మతులు, పూడికతీతకు రూ.9.60లక్షలు, యడవల్లి గ్రామం యడవల్లి చిన్న చెరువు మరమ్మతులు, పూడికతీతకు రూ.9.50లక్షలు, యడవల్లి పెద్ద చెరువు మరమ్మతులు, పూడికతీతకు రూ.9.50లక్షలు, సత్యవోలు గ్రామం దసబంధం ట్యాంకు మరమ్మతులు, కాలువ పూడికతీతకు రూ.9.20లక్షలు, చోళ్లవీడు గ్రామం రంగయ్య నాయుడు చెరువు మరమ్మతులు, పూడికతీతకు రూ.9.80లక్షలు, గుడిమెట్ట గ్రామం శంకరుని చెరువు మరమ్మతులు, కాలువ పూడికతీతకు రూ.9.60లక్షలు, ఒద్దులవాగుపల్లి గ్రామం దసబంధం ట్యాంకు మరమ్మతులు, పూడికతీతకు రూ.9.90లక్షలు, కొత్తపల్లి గ్రామం చామవారి కుంట మరమ్మతులు, కాలువ పూడికతీత పనులకు రూ.9.70లక్షలు, గంగంపల్లి గ్రామం గంగమ్మ ట్యాంకు మరమ్మతులు, కాలువ పూడికతీతకు రూ.9,50లక్షలు మంజూరయ్యాయి.
రైతులకు అండగా కూటమి
ఈ నిధుల ద్వారా చెరువుల గండ్లు పూడ్చడం, కాలువల పూడికతీత, స్లూయిస్ మరమ్మతులు వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తయిన పనుల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పనులు కూడా పూర్తయితే వర్షపు నీరు వృథా కాకుండా నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఫలితంగా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుందని ఆయా గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు ప్రభుత్వంగా నిరూపించుకున్న చంద్రబాబు సర్కార్‌కు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి మండల ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.