నేడు అల్పపీడనం
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:32 AM
అండమాన్, నికోబార్ దీవుల పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడింది.
తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ ప్రకటన
విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అండమాన్, నికోబార్ దీవుల పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి శనివారానికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆదివారానికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అనంతరం దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం 17వ తేదీ తర్వాత ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటనుంది. మరికొన్ని మోడళ్ల మేరకు తుఫాను సముద్రంలోనే బలహీనపడి వాయుగుండంగా తీరం దాటుతుంది. కాగా, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురువారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రిపూట చలిగాలులు వీచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా కిలగాడలో 11.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు