Share News

అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

ABN , Publish Date - Aug 15 , 2026 | 03:58 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..
AP Thunderstorm Alert

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.


అలాగే కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఏపీఎస్‌డీఎంఏ. ఆయా జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగుపాటు హెచ్చరికల దృష్ట్యా ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశాలు కనిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. అలాగే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడలో రేపు డీఎస్సీ- 2025 ఉపాధ్యాయుల ర్యాలీ

ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దని ప్రచారం చేయండి.. మహిళలతో సీఎం చంద్రబాబు

Updated Date - Aug 15 , 2026 | 04:01 PM