Share News

15న మరో వాయుగుండం

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:09 AM

గత నెలలో మాదిరిగా ఈ నెలలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనున్నది. ఈనెల 12న ఉత్తన అండమాన్‌ సముద్రంపై ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడి...

15న మరో వాయుగుండం

  • రెండు రోజుల ముందు బంగాళాఖాతంలో అల్పపీడనం

  • మూడురోజుల్లో నిష్క్రమించనున్న నైరుతి!

అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు2(ఆంధ్రజ్యోతి): గత నెలలో మాదిరిగా ఈ నెలలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనున్నది. ఈనెల 12న ఉత్తన అండమాన్‌ సముద్రంపై ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడి, ఈనెల 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావం కోస్తా, రాయలసీమలో ఉంటుందని అంచనా వేసింది. అయితే దీనిపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొంది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత నెలకొంటుందని తెలిపింది. ముఖ్యంగా శనివారం అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడతాయని వివరించింది. శుక్రవారం కడప, తిరుపతి జిల్లాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, అల్లూరి, బాపట్ల, ఎన్టీఆర్‌, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడ్డాయి. మరోవైపు.. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:09 AM