ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడిని ఖండించిన కిరణ్ రాయల్

ABN, Publish Date - Apr 08 , 2026 | 11:39 AM

ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ నాయకుల దాడిని జనసేన నేత కిరణ్ రాయల్‌ ఖండించారు. వాస్తవాలు చెబితే దాడులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు.

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై వైసీపీ నాయకుల దాడిని తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్‌ ఖండించారు. వాస్తవాలు చెబితే దాడులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. మీడియా సంస్థలపై దాడులు చేయడానికి సిగ్గులేదా? అని విమర్శలు గుప్పించారు.

Updated at - Apr 08 , 2026 | 11:44 AM