మొబైల్ తయారీలో భారత్‌కు రెండో స్థానం: మోదీ
ABN, Publish Date - Jun 19 , 2026 | 07:47 AM
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక, సాంకేతిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. మొబైల్ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకోవడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక, సాంకేతిక పురోగతిని ప్రపంచ వేదికపై ప్రస్తావించారు. మొబైల్ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకోవడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ప్రతిభ, కృషిని అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. పారిస్ నగర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర విశేషమని కొనియాడిన మోదీ, ఫ్రాన్స్‌ను ‘సిటీ ఆఫ్ ఇన్నోవేషన్’గా అభివర్ణించారు. ప్రపంచ శాంతి, భద్రత, సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక ప్రగతి కోసం భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత కీలకంగా మారిందని ఆయన స్పష్టం చేశారు.
Updated at - Jun 19 , 2026 | 07:47 AM