Bhogi Vijayawada: విజయవాడలో భోగి సంబరాలు..

ABN, Publish Date - Jan 14 , 2026 | 11:49 AM

సంక్రాంతి పండుగతో గ్రామ గ్రామాన సందడి నెలకొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండగను అందరూ ఒకచోట కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈరోజు బోగి కావడంతో ..

ఎన్టీఆర్ జిల్లా, జనవరి 14: సంక్రాంతి పండుగతో గ్రామ గ్రామాన సందడి నెలకొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండగను అందరూ ఒకచోట కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈరోజు బోగి కావడంతో అందరూ భోగి మంటలు వేసి, సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి గంగిరెద్దులతో, హరిదాసులతో ఆటపాటలతో సందడి చేశారు. పాత వస్తువులు భోగిమంటల్లో వేసి కొత్త వెలుగులతో ముందుకు సాగడానికి ఆనందంగా కుటుంబ సభ్యులు, గ్రామ గ్రామాన భోగి పండుగను జరుపుకున్నారు.

Updated at - Jan 14 , 2026 | 11:49 AM