ఆస్తుల వివాదం.. షర్మిలకు వైఎస్ భారతి కీలక లేఖ
ABN, Publish Date - Oct 27 , 2026 | 06:28 PM
షర్మిలకు వైఎస్ జగన్ సతీమణి భారతి లేఖ రాశారు. ఈ లేఖలో కీలక విషయాలను భారతి ప్రస్తావించారు. లేఖ ద్వారా నీకు స్పష్టత ఇవ్వదలచుకున్నాను...
షర్మిలకు వైఎస్ జగన్ సతీమణి భారతి లేఖ రాశారు. ఈ లేఖలో కీలక విషయాలను భారతి ప్రస్తావించారు. ‘లేఖ ద్వారా నీకు స్పష్టత ఇవ్వదలచుకున్నాను. మన కుటుంబంలో ఆస్తులపై చర్చలు, వివాదాలు.. వాటి విషయంలో నీకు క్లారిటీ ఇస్తున్నా.. కొన్ని నిర్థిష్టమైన ఆస్తులతో నీకెలాంటి సంబంధం లేదు.. అలాంటి ఆస్తులపై నీకు ఎలాంటి హక్కులేదు.. ఆ ఆస్తులు నా పుట్టింటివారు నాకు బహుమతిగా ఇచ్చినవి.. నా స్వయంకృషితో కష్టార్జితంతో సంపాదించుకున్నవి.. వాటి సంపాదనలో, నిర్మాణంలో గానీ.. వైఎస్ కుటుంబానికి ఎలాంటి భాగస్వామ్యం లేదు.. నా పుట్టింటి వైపు నుంచి వచ్చిన, నా స్వార్జిత ఆస్తులపై నువ్వు హక్కులు కోరడం సరికాదు.. ఆస్తుల విషయంలో వివాదాల్లోకి లాగడం సరికాదు’ అంటూ షర్మిలకు వైఎస్ భారతి లేఖ రాశారు.
Updated at - Oct 27 , 2026 | 06:28 PM