యానాంలో చీరమేను సందడి.. ఒక బకెట్ రూ.26 వేలకు విక్రయం

ABN, Publish Date - Sep 26 , 2026 | 02:41 PM

యానాం మార్కెట్‌లో చీరమేను చేపల కోసం విపరీతమైన సందడి నెలకొంది. ఈ చేపలకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా కేవలం ఒక్క బకెట్ చీరమేను చేపల ధర ఏకంగా రూ. 26,000 పలికింది.

తూర్పు గోదావరి జిల్లా యానాంలో మత్స్యకారులకు చీరమేను చేప పంటపడింది. తాజాగా కిలో చీరమేనును 4వేలకు విక్రయించారు. దీంతో ఒక్క బకెట్ చీరమేనును ఒక మహిళ రూ. 26,000కు వేలంపాటలో కొనుగోలు చేసింది. దీపావళి ముందు శీతాకాలం ప్రారంభంలో ఈ చేప సముద్రంలో దొరుకుతుంది. తూర్పు గాలుల సమయంలో ఈ చేప నీటిపై తేలియాడుతుంది. ఇవి చాలా చిన్నగా వలలోంచి జారిపోయేంతగా ఉండటంతో చీరలతో మాత్రమే పడతారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Sep 26 , 2026 | 02:41 PM