ఆకట్టుకుంటున్న వింగ్స్ ఇండియా షో..

ABN, Publish Date - Jan 30 , 2026 | 04:45 PM

బేగంపేట్ ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా షో మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సందర్శకులతో కిటకిటలాడుతోంది..

హైదరాబాద్: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా షో మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేపటి వరకు సాధారణ ప్రజలకు ఈ షోను వీక్షించే అవకాశం ఉంది. విమానాల ప్రదర్శనను చూడడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ఆకాశంలో సూర్యకిరణ్ టీం చేసిన వైమానిక విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విమానాల అద్భుత ప్రదర్శనతో షో మరింత ఆకర్షణీయంగా మారింది.

Updated at - Jan 30 , 2026 | 05:11 PM