టీఎంసీలో ముసలం.. దీదీ పై 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు
ABN, Publish Date - Jun 08 , 2026 | 07:48 AM
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో మమతా బెనర్జీ (దీదీ) నాయకత్వంపై ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు బహిరంగ తిరుగుబాటు చేశారు. స్పీకర్ రతీంద్రనాథ్ బోస్‌ను కలిసి తమకు మెజారిటీ ఉందని లేఖ అందజేయడంతో పార్టీలో చారిత్రాత్మక సంక్షోభం, చీలిక ఏర్పడింది.
బెంగాల్ రాజకీయం రోజు రోజుకి ముదురుతోంది. ఎంపీలు ఎమ్మెల్యేలు టీఎంసి నుంచి వెళ్ళిపోతూ ఉండడంతో మమతా బెనర్జీ చర్యలు మొదలు పెట్టారు. అల్లుడు అభిషేక్ బెనర్జీ అధికారాలను కట్టడి చేశారు. యోసఫ్ పఠాన్ ఎంపీగా రాజీనామా చేయాలనే వ్యవహారం చర్చనీ అంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లో ముసలం నెలకొంది. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతూ ఉండటంతో మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
Updated at - Jun 08 , 2026 | 07:48 AM