తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం
ABN, Publish Date - Nov 28 , 2026 | 04:46 PM
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూణ్ వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని తమిళనాడు ప్రభుత్వం వెలిగించింది.
తమిళనాడు, నవంబర్ 28: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూణ్ వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని తమిళనాడు ప్రభుత్వం వెలిగించింది. సుప్రీంకోర్టు నియమించిన రిసీవర్లు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో దీపారాధన కార్యక్రమం జరిగింది. కొండపైకి ఆలయ సిబ్బంది, భద్రతా బలగాలతో పాటు ప్రత్యేక అనుమతి ఉన్న 50 మంది భక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. శాంతిభద్రతల దృష్ట్యా సాధారణ భక్తులకు కొండపైకి అనుమతి నిరాకరించారు.
Updated at - Nov 28 , 2026 | 05:09 PM