హసానబాద్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత..
ABN, Publish Date - Apr 06 , 2026 | 09:22 PM
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం హసానబాద్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టోల్ ప్లాజాకు జమ్మిదోర్నాల పేరు పెట్టడంపై వివాదం తలెత్తింది. ఈ పేరుపై హసానబాద్ గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మార్కాపురం: దోర్నాల మండలం హసానబాద్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టోల్ ప్లాజాకు జమ్మిదోర్నాల పేరు పెట్టడంపై వివాదం తలెత్తింది. ఈ పేరుపై హసానబాద్ గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికే టోల్ ప్లాజాకు ఖరారైన జమ్మిదోర్నాల పేరునే పెట్టాలని ఆ గ్రామస్థులు డిమాండ్ చేశారు. దీనిపై ఇరుగ్రామాల ప్రజలు టోల్ ప్లాజా వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్‌కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పిఠాపురం ప్రజలకు గుడ్ న్యూస్.. పవన్ చొరవతో రూ.37.25 కోట్లు విడుదల
పోలీసులకు చిక్కిన నకిలీ కరెన్సీ ముఠా.. పక్కా ప్లాన్‌తో అడ్డంగా బుక్కయ్యారు..
Updated at - Apr 06 , 2026 | 09:22 PM