Share News

తెలంగాణ బోనాల జాతర 2026.. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు

ABN , Publish Date - Jul 16 , 2026 | 08:59 AM

తెలంగాణలో బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది.

తెలంగాణ బోనాల జాతర 2026.. గోల్కొండ కోటలో మొదలైన బోనాలు

ఇంటర్నెట్ డెస్క్: డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు.. పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని ఆలయాలకు కదిలే తరుణం వచ్చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు నేడు గోల్కొండ కోటలో ప్రారంభం కానున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకల కోసం.. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి పరిధిలోని సుమారు 3 వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.


ఇవీ చదవండి:

నేడు పూరీ జగన్నాథుని రథయాత్ర

హైదరాబాద్‌లో వైభవంగా ఆషాఢ బోనాలు.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Updated Date - Jul 16 , 2026 | 10:00 AM