కొత్త రాజకీయ పార్టీ పెడతా: అన్నామలై..
ABN, Publish Date - Jun 06 , 2026 | 07:21 AM
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారు. అనంతరం తమిళనాట తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అన్నామలై ప్రకటించారు.
చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారు. అనంతరం తమిళనాట తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అన్నామలై ప్రకటించారు. ప్రజలను ఏకం చేసి ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాలన్నదే తన ఆశయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజీనామా ఆమోదం తర్వాత ఢిల్లీ నుంచే సోషల్ మీడియా ద్వారా తన భవిష్యత్ ప్రణాళికలను అన్నామలై వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
3.9 బిలియన్ డాలర్లకు చేరిన భారత్-ఫిలిప్పీన్స్ వాణిజ్యం
బాంబు పేలుడు కేసు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు..
Updated at - Jun 06 , 2026 | 07:27 AM