సాక్షి టీవీకి సుప్రీంలో దక్కని ఊరట
ABN, Publish Date - Feb 02 , 2026 | 02:05 PM
సాక్షి టీవీకి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఫైబర్ నెట్‌లో సాక్షి ప్రసారాలను అడ్డుకున్నారని సుప్రీం కోర్టులో సాక్షి యాజమాన్యం రిట్ పిటిషన్ వేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: సాక్షి టీవీకి సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించలేదు. ఫైబర్ నెట్‌లో సాక్షి ప్రసారాలను అడ్డుకున్నారని సుప్రీం కోర్టులో సాక్షి యాజమాన్యం రిట్ పిటిషన్ వేసింది. రిట్ పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి.. పిటిషన్‌ను కొట్టివేసింది. టీడీ శాట్‌లోనే (టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలేట్ ట్రైబ్యునల్) తేల్చుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Updated at - Feb 02 , 2026 | 02:44 PM