చిన్నారి కనుగుడ్డు పీకేసిన వీధి కుక్కలు..

ABN, Publish Date - Mar 27 , 2026 | 06:17 PM

భువనగిరిలో వీధి కుక్కలు విజృంభించాయి. తారకరామనగర్‌లో రెచ్చిపోయిన వీధి కుక్కలు.. చిన్నారిపై దాడి చేశాయి. బాలుడిని తీవ్రంగా గాయపరిచి కనుగుడ్డును పీకేశాయి.

యాదాద్రి: భువనగిరిలో వీధి కుక్కలు విజృంభించాయి. తారకరామనగర్‌లో రెచ్చిపోయిన వీధి కుక్కలు.. చిన్నారిపై దాడి చేశాయి. బాలుడిని తీవ్రంగా గాయపరిచి కనుగుడ్డును పీకేశాయి. గమనించిన స్థానికులు గ్రామ సింహాలను వెంటనే తరిమేశారు.. చిన్నారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాలనీవాసులు, కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుటే భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఘటనపై స్పందించారు. బాలుడి వైద్య ఖర్చులు మెుత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో వీధి కుక్కల దాడి అంశం మరోసారి తెరపైకి వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

అయ్యో పాపం.. వివాహానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు..

శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం

Updated at - Mar 27 , 2026 | 06:23 PM