కరువు సీమను సిరుల సీమగా మారుస్తున్నాం
ABN, Publish Date - Oct 02 , 2026 | 01:45 PM
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కరువు సీమను సిరుల సీమ గా మారుస్తున్నాం అని అన్నారు.
రూ.లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రధాని మోదీ సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని.. సాగునీరు అందిస్తే సీమ రైతులు బంగారం పండించగలరని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకరిస్తున్నారని.. ఆమె కోరిన నిధులను అందిస్తున్నారని తెలిపారు. రాయలసీమ చరిత్రలో నిలిచిపోతుందని.. కరువు సీమను సిరుల సీమగా మారుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Oct 02 , 2026 | 01:47 PM