మొదలైన నవశకం.. కోల్‌కతా గడ్డపై కాషాయ జెండా..
ABN, Publish Date - May 10 , 2026 | 06:52 AM
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు. కోల్‌కతా గడ్డపై తొలిసారిగా కాషాయ జెండా ఎగిరింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో నవశకం ఆరంభమైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. రవీంద్రరాజ్ ఠాగూర్ జయంతి వేళ.. పశ్చిమ బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బీజెపీ నేత సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో గవర్నర్ ఆర్ రవి సువేందుతో ప్రమాణం చేయించారు. ప్రమాణం ముగియగానే ప్రధాని మోదీ ఆశీస్సులు తీసుకున్నారు సువేందు అధికారి.
Updated at - May 10 , 2026 | 06:53 AM