అమరవీరుల స్థూపం దగ్గర NCC క్యాడెట్స్ యోగా కార్యక్రమం

ABN, Publish Date - Jun 20 , 2026 | 12:30 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఎన్‌సీసీ క్యాడెట్లు భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఎన్‌సీసీ క్యాడెట్లు భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణకు యోగా ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మోహిత్ శర్మ, ఎస్‌కే మౌలాలి సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా ఇన్‌స్ట్రక్టర్ స్నేహా క్యాడెట్లకు యోగా శిక్షణ అందించారు. ఫిట్‌నెస్‌ మరియు ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jun 20 , 2026 | 12:30 PM