చేతబడి చేస్తోందనే అనుమానంతో వృద్ధురాలిపై దాడి

ABN, Publish Date - Sep 28 , 2026 | 05:00 PM

చేతబడి చేస్తోందనే అనుమానంతో వృద్ధురాలిపై దాడి చేసిన ఘటన జిల్లాలోని మంచాల మండలంలో జరిగింది. నోముల గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు చేతబడి చేస్తోందనే నెపంతో గ్రామస్థులు దాడి చేశారు.

రంగారెడ్డి, సెప్టెంబర్ 28: చేతబడి చేస్తోందనే అనుమానంతో వృద్ధురాలిపై దాడి చేసిన ఘటన జిల్లాలోని మంచాల మండలంలో జరిగింది. నోముల గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలు చేతబడి చేస్తోందనే నెపంతో గ్రామస్థులు దాడి చేశారు. ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబసభ్యులు మంచాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated at - Sep 28 , 2026 | 05:07 PM